అలాగైతే ‘కట్’ చేస్తాం.. భారత్‌పై ట్రంప్ రుసరుస

భారత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా వస్తువులపై భారత్‌లో 100 శాతం పన్ను వసూలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై చాలా దేశాలు పన్నులు అధికంగా వసూలు చేస్తున్నాయని, మేమేమైనా పిగ్గీ బ్యాంక్‌లమా.. అందరూ మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నారు.. అమెరికా సంపదకు నష్టంవాటిల్లే విధంగావుంటే బిజినెస్ సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ విషయాన్ని ప్రస్తావించారు.

భారత్‌లో మా వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారని, కానీ తాము విధించడం లేదన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న హార్లీడేవిడ్‌సన్‌ బైకులపై ఇండియా అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి తమ దేశం వేలల్లో బైకులను దిగుమతి చేసుకుంటోందన్నారు. అమెరికాని దోచుకునేందుకు ప్రయత్నిస్తే ఆయా దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

Related News