అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. పళని సర్కార్‌కి బిగ్ రిలీఫ్

అన్నాడీఎంకె రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో పళనిస్వామి సర్కార్‌కి బిగ్ రిలీఫ్. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హతపై గురువారం మద్రాస్ హైకోర్టులోని ఇద్దరు సభ్యుల గత ధర్మాసనం వేర్వేరుగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ నిర్ణయాన్ని మూడో న్యాయమూర్తికి బదిలీ అయ్యింది. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై గత సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు స్పీకర్ ధన్‌పాల్. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్‌జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా, ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సుందర్ ఆ నిర్ణయాన్ని విభేదించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ సీనియర్ న్యాయమూర్తి చేపడతారని చీఫ్‌ జస్టిస్ ప్రకటించారు.

న్యాయస్థానం తీర్పుతో తమిళనాడు అసెంబ్లీలో యథాతథ స్థితి కొన సాగనుంది. గత ఆగస్టు 22న పళనిస్వామి సర్కార్‌ అవిశ్వాసంపై దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే! తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో మూడో న్యాయమూర్తి.. ఎవరి నిర్ణయాన్ని సమర్థిస్తారు? అన్నదే ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Related News