వర్మ కొత్త ప్రయోగం.. ఈసారి మారుతీరావ్ విలన్!

సోషల్ మీడియాలో ఇటీవల దూకుడు తగ్గించిన టెరిఫిక్ డైరెక్టర్ వర్మ.. కొద్దికొద్దిగా మళ్ళీ పుంజుకుంటున్నాడు. మొన్నటివరకూ తన ‘భైరవగీత’ సినిమా ప్రమోషన్ కోసం పాటుపడ్డారు. నిన్న.. ఆలీ తమ్ముడి ‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి సామజిక సమస్యల మీద, వర్తమాన పరిణామాల మీద దృష్టి పెట్టేశారు డైరెక్టర్ వర్మ. ‘మిర్యాలగూడ దుర్ఘటన’ను ప్రస్తావిస్తూ పరువు హత్యలపై తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ‘ప్రణయ్‌ని చంపడం ద్వారా అమృత తండ్రి మారుతీరావుకు పరువు దక్కిందనడంలో అర్థం లేదు. అతడొక కరడుగట్టిన చెత్త నేరగాడు. వాడు చచ్చినప్పుడు మాత్రమే పరువనేది నిలబడేది. పరువు కోసం హత్యలు చేసే మారుతీరావు లాంటి వాళ్ళను హత్య చేయడమే నిజమైన పరువు హత్య’ అంటూ తనదైన శైలిలో భాష్యం చెప్పారు.

Related News