వైసీపీలోకి టాలీవుడ్ ప్రముఖులు.!

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. విజయనగరం జిల్లా లగరకోటలో ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తోన్న జగన్ ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి లకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, వీరిరువురి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్న సందేహాలు ఈ భేటీ ద్వారా వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి జగన్ తో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.

Related News