ఆమెకు డబ్బు పంపిన సుకుమార్

‘రంగస్థలం’ సినిమా డైరెక్టర్ సుకుమార్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ పాట పాడినందుకుగాను తనకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గంటా వెంకటలక్ష్మికి లక్షరూపాయల నగదు పంపించారు. తన చేత పాట పాడించుకుని డబ్బివ్వకుండా మధ్యవర్తి మోసం చేశాడని ఇటీవల వెంకటలక్ష్మి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వేదన విన్న డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి లక్ష నగదు ఇవ్వడంతో సింగర్ వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ పాట పాడే అవకాశం ఇచ్చారని.. సుకుమార్ పంపిన డబ్బులు తనకు అందాయని ఆమె స్పష్టం చేశారు. సినిమాల్లో తమ ప్రతిభ నిరూపించుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నటించాలని.. పాటలు పాడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని, వారందరిని గుర్తించి అవకాశం కల్పించాలని వెంకటలక్ష్మి కోరారు. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Related News