కర్ణాటక పోలీసులకు కొత్త టెన్షన్

కర్ణాటక పోలీసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఏ మాత్రం డైట్ పాటించకుంటే వాళ్లని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు. ఇంతకీ వున్నట్లుండి.. కర్ణాటక పోలీసుశాఖలో ఈ మార్పు ఏంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. కొన్నాళ్లుగా అక్కడి పోలీసుల్లో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇటీవలికాలంలో వాళ్ల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాదు గడిచిన 18 నెలల్లో 100 మంది పోలీసులు స్థూలకాయం వంటి సమస్యలతో చనిపోయినట్టు తేలింది. దీంతో పరిస్థితి గమనించిన ఉన్నతాధికారులు, సరికొత్త ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఒకవేళ అధికారుల ఆదేశాలను పక్కనపెడితే తొలుత ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు.. అప్పటికీ మార్పురాకుంటే ఆ తర్వాత విధుల నుంచి తొలగించడం ఖాయం.

స్థూలకాయంతో బాధపడుతున్నవాళ్లు బరువు తగ్గేలా ట్రైనింగ్ ఇప్పిస్తారు అధికారులు. ఆ సమయంలో డైట్‌లో మార్పులు కూడా వుంటాయి. ఇందులోభాగంగానే కేసీఆర్‌పీ పోలీసుల షుగర్ లెవల్స్‌, ఆరోగ్య పరిస్థితిని ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పరిశీలిస్తున్నామని, ఆరోగ్యం పట్ల శ్రద్ధగా వుండాలని హెచ్చరించారు కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ చీఫ్ భాస్కర్‌రావు. స్టేట్ రిజర్వ్ పోలీస్‌లో మొత్తం 14 వేల మంది పోలీసులున్నారు. భారీ కార్యక్రమాలకు భద్రత కల్పించేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ బలగాలను వినియోగిస్తుంటారు.

 

Related News