ధోని వైఫ్ సాక్షి.. ఫ్యామిలీ గురించి నాలుగు మాటలు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే! టోర్నమెంట్ జరిగి నప్పుడు ధోనీ గురించి స్పెషల్‌గా రాసుకొస్తాయి ప్రధాన పత్రికలు. ఇక ధోని వైఫ్ సాక్షికి ఫాలోయింగ్ ఎక్కువే! మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియాలకు వెళ్లి జట్టును ప్రోత్సహించడంలో ముందుంటారు. తాజాగా ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు చకచకా రిప్లై ఇచ్చేసింది.

ప్రస్తుతం తాము రాంచీలో ఉంటున్నామని, చిన్న టౌన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ధోనీ, జీవాలతో తనకు ఎలాంటి కష్టంలేదని, ఇద్దరూ సహకరిస్తారని తెలిపింది. సెలబ్రిటీ లైఫ్‌కు తాను ఇంకా అలవాటుపడలేదని ఒక్క ముక్కలో తేల్చేసింది. తనకు చెన్నై అంటే ఇష్టమని, ధోనీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడని వెల్లడించింది.  ఏదైనా మ్యాచ్‌లో ధోనీ  హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్‌ని ముగిస్తే మీరు ఎలా ఫీలవుతారన్న ప్రశ్నకు సాక్షి ఇలా జవాబు ఇచ్చారు. అభిమానులు ఎలా ఫీలవుతారో నేను అంతేనని తెలిపింది.

READ ALSO

Related News