వైఫ్‌తో కలిసి ధోని కూడా

సల్మాన్- జాక్విలైన్ నటించిన ‘రేస్ 3’ మూవీ విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ వేగవంతం చేసింది యూనిట్. ముంబైలో సెలబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా, దీనికి తన క్లోజ్‌ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేశాడు సల్మాన్. రేస్ 3లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, అనిల్‌కపూర్, డైరెక్టర్ రెమో డిసౌజాలతోపాటు బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్ ధోనీ, అతని భార్య సాక్షి కూడా వచ్చారు. నార్మల్‌గా సల్మాన్- ధోనీ క్లోజ్ ఫ్రెండ్స్. గత డిసెంబర్‌లో సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ధోనీ హాజరైన విషయం తెల్సిందే!

Good morning everyone ❤️🤩

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhoni.fc) on

మరోవైపు రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలుకొట్టింది రేస్ 3. కేవలం శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ ఫిల్మ్‌కి రూ.130 కోట్లు రావడం విశేషం. గతంలో ఏ బాలీవుడ్ మూవీకి ఈ రేంజ్‌లో రాలేదని చెబుతున్నారు. దంగల్ మూవీ 110 కోట్లకు వెళ్లిన విషయం తెల్సిందే! రేస్ 3 కోసం పెట్టిన ఖర్చు మొత్తం ఇప్పటికే ప్రొడ్యూసర్స్‌కి వచ్చింది. ఇక మిగిలింది బయ్యర్ల వంతు. ఈద్ సందర్భంగా ఈనెల 15న థియేటర్స్‌కి రానుంది ‘రేస్ 3’.

 

Related News