సుప్రీం తీర్పుతో హోటల్ స్టాఫ్ ఫ్లాష్ మాబ్ డ్యాన్స్!

స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల దేశవ్యాప్తంగా గేలు హర్షం వ్యక్తం చేస్తుండగా,,ఢిల్లీలోని ఓ హోటల్ స్టాఫ్ వినూత్నంగా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అక్కడి లలిత్ గ్రూపు హోటల్ సిబ్బంది అప్పటికప్పుడు ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ చేసి పలువురు కస్టమర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ హోటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ సూరి.. స్వయంగా స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఇన్నేళ్ళకు అత్యున్నత న్యాయస్థానం గేల రైట్స్ కు లీగాలిటీ కల్పించడం హర్షణీయమని, సమాజంలో వారికీ తమ హక్కులకోసం పోరాడే స్వేచ్చ ఉందన్న విషయాన్ని కోర్టు గుర్తించిందని ఆయన అన్నారు. సెక్షన్ 377‌ని కోర్టు రద్దు చేయడం చరిత్ర్రాత్మకం అని కేశవ్ సూరి పేర్కొన్నారు.

Related News