టవర్‌లో మంటలు, దీపికా సేఫ్

ముంబైలోని ఓ భారీ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లోవున్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పైరెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫైర్ సిబ్బంది 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ు.

ఈ బిల్డింగ్‌లో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బాలీవుడ్‌ నటి దీపికా సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలున్నాయి. 26వ ఫ్లోర్‌లో బాలీవుడ్‌ నటి దీపికా ఫ్లాట్ వుంది. ఐతే, ప్రమాదం తర్వాత దీపికాకు ఏమైందంటూ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. వెంటనే స్పందించిన దీపిక.. నేను సురక్షితంగా ఉన్నాను.. ప్రాణాలు పణంగా పెట్టి మంటలను అదుపు చేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్థన చేద్దామని ట్వీట్ చేసింది.

 

READ ALSO

Related News