ఒకదానినొకటి ఢీ కొన్న 4 వాహనాలు.. 11మంది మృతి

తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గజ్వేల్ మండలం రిమ్మనగూడెం దగ్గర రాజీవ్ హైవేపై ఆర్టీసీ బస్సు, రెండు లారీలు, క్వాలీస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 30 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సీఎం కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి హరీష్ రావు హుటాహుట ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Related News