నాకు పరువే ముఖ్యం.. కోటి రూపాయలిచ్చి నేనే చంపించా!

మిర్యాలగూడ పరువు హత్య కేసు కొలిక్కొచ్చింది. కొత్తగా పెళ్లయిన అమృత వర్షిణి కళ్లెదుటే భర్త ప్రణయ్‌ని నడిరోడ్డుపై హతమార్చిన ఈ సంచలన ఘటనలో దోషి ఆమె తండ్రేనని తేలిపోయింది. శనివారం ఉదయానికల్లా అమృత తండ్రి మారుతీరావుని, అతడి సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారించడం మొదలుపెట్టారు. అందరూ అనుమానించినట్లే అమృత తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు.

‘కూతురిపై ప్రేమతోనే అల్లుడ్ని చంపించా’నని అమృత తండ్రి మారుతీరావు అంగీకరించాడు. 10 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకుల సాయంతో ఈ పని కానిచ్చినట్లు చెప్పుకున్నాడు. కూతురికి అబార్షన్ చేయాలని, లేదంటే.. డెలివరీ సమయంలో బిడ్డను చంపాలని డాక్టర్‌తో బేరమాడినట్లు కూడా చెప్పాడు. కూతురి జీవితం కంటే సమాజంలో పరువే ముఖ్యమనుకున్నానని, జైలుకెళ్లడానికి సిద్ధమయ్యే ఈ పని చేశానని అతడు చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. కేసు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు నల్గొండ ఎస్పీ రంగనాధ్.

Related News