ఫిల్మ్స్‌లోకి క్రికెటర్ షమీ వైఫ్

టీమిండియా ఆటగాడు మహ్మద్‌ షమి వైఫ్ హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అంజద్‌ఖాన్ డైరెక్షన్‌లో రానున్న ‘ఫత్వా’ మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ర్టీలో అడుగుపెట్టనుంది. ఇందులో జర్నలిస్ట్‌గా హసీన్ కనిపించనుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుకానుంది. తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నానని, ఈ క్రమంలో డైరెక్టర్ అంజద్‌ఖాన్‌ చేయనున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తానని చెప్పడంతో ఆయన ఓకే చేశారని తెలిపింది.

తన భర్త షమితో న్యాయపోరాటం చేసేందుకు డబ్బు కావాలని అంటోంది హసీన్. షమీపై సంచలన ఆరోపణలు చేసి కేసులు పెట్టింది ఆయన భార్య హసీన్ జహాన్. ప్రస్తుతం ఫ్యామిలీ కేసు వ్యవహారం కోర్టులో వుంది. గలో మోడల్‌గా, ఐపీఎల్‌లో చీర్‌లీడర్‌గా కూడా పనిచేసింది హసీన్. ఈ ఫిల్మ్ కోసం చేసిన ఫొటో‌షూట్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది.

READ ALSO

Related News