బీజేపీ కూటమిని ఎదుర్కొంటాం

బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే కోవకు చెందినవని, ‘ బయట గుద్దులాట, లోపల ముద్దులాటలా’ ఆ పార్టీల తీరు ఉందని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీలతో జట్టు కడతామని ఆయన తెలిపారు.

అటు-పెట్రో ధరల పెంపునకు నిరసనగా సోమవారం భారత్ బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిందని, ఈ బంద్‌లో పాల్గొనని వాళ్ళు దేశద్రోహులని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నిర్ణయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, పెద్ద నోట్ల రద్దు సమయంలో 120 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు.

Related News