కర్నాటక బైపోల్‌లో బీజేపీ ఢమాల్

కర్నాటక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చావుదెబ్బ తిన్న బీజేపీకి మరో దెబ్బ తగిలింది. ఉప ఎన్నికలో మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక జరిగిన బెంగళూరు పరిధిలోని జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి ఘన విజయం సాధించారు. 3775 ఓట్ల మెజార్టీతో బీజేపీ ప్రత్యర్థిని ఓడించారు. సౌమ్యా రెడ్డి గెలుపుతో, ఆమె అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. సొంత స్థానాన్ని కోల్పోవడంతో బీజేపీ నేతలు తలలుపట్టుకుంటుండగా, ఈ ఎన్నికలో జేడీఎస్ అభ్యర్థిని నిలుపకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది.

Related News