తెలంగాణ అసెంబ్లీ బరిలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీలు!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి బరిలోకి మాజీ ఎంపీలను దించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగానే పీసీసీ చేయిస్తున్న సర్వేలో పలువురు మాజీ ఎంపీల పేర్లను చేర్చినట్లు సమాచారం. వాళ్లలో పొన్నం ప్రభాకర్ (కరీంనగర్)‌, మధుయాష్కీ (నిజామాబాద్), బలరాంనాయక్ (మహబూబాబాద్), సురేష్‌షెట్కార్‌ (నారాయణఖేడ్) అంజన్‌కుమార్‌ (సికింద్రాబాద్) లేదా సర్వేసత్యనారాయణ (సికింద్రాబాద్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు లేదా భువనగిరి), మల్లు రవి (జడ్చెర్ల), రమేష్ రాథోడ్ (ఖానాపూర్), నాగం జనార్థన్‌రెడ్డి (నాగర్ కర్నూల్) గతంలో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన శ్రవణ్‌కుమార్‌రెడ్డి (దుబ్బాక లేదా మెదక్‌‌) వున్నారు.

ఈ నేతల పేర్లను పరిశీలనలో వుంచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవరు? ఎవరైతే బాగుంటుందనే దానిపై నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఈసారి మాజీ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించుతామని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి నేతలు వివరించినట్టు తెలుస్తోంది.

READ ALSO

Related News