‘భారత్‌కు కొత్త రాజ్యాంగం’

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మూడో భార్య అయిన సునంద పుష్కర్ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన శశిథరూర్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిచి అధికారంలోకి వస్తే భారతదేశం కాస్తా ‘హిందూ పాకిస్థాన్’లా మారుతుందన్నారు. పాక్‌లో మైనారిటీ హక్కులకు గౌరవం ఉండదని, ఇక్కడ కూడా బీజేపీ అదే తరహాలో పాలన సాగించే అవకాశం లేకపోలేదన్నారు. ఇందుకోసం బీజేపీ కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటుందని చెప్పుకొచ్చారు. మళ్లీ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడున్న రాజ్యాంగం స్థానంలో కొత్తది రావడం తథ్యమన్నారు.

శశిథరూర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. కేరళకు చెందిన 62ఏళ్ల శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో కీలకనేత. మొదటి భార్య తిలోత్తమ ముఖర్జీకి విడాకులు ఇచ్చిన ఆయన తర్వాత క్రిస్టా గిలిస్ అనే ఆమెను వివాహమాడి ఆమెకు కూడా విడాకులిచ్చారు. తర్వాత 2010లో సునంద పుష్కర్ ను వివాహమాడి ఆమెతో 2014వరకూ కాపురం చేశారు. ప్రస్తుతం ఆమె చావుకి ఇతనే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటున్నారు.

READ ALSO

Related News