ఇఫ్తార్‌ విందు: రాహుల్‌‌తో ప్రణబ్‌ మంతనాలు

ఇఫ్తార్ విందుతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ సందడిగా మారింది. బుధవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ విందుకి మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభాపాటిల్‌, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా హాజరయ్యారు.

ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత ప్రణబ్‌తో రాహుల్ భేటీకావడం ఇదే ఫస్ట్‌టైమ్. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే వుండడంతో నేతల సమావేశం కీలకంగా మారింది. ముఖ్యంగా రా‌హుల్‌తో ప్రణబ్‌ సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. ఈసారి పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రత్యర్థులపై ఎలాంటి వ్యూహాలను అవలంభించాలి? వంటి అంశాలపై చర్చించినట్లు కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట.

ఈ విందుకి దేశంలోని 17 పార్టీలకు చెందిన నేతలను రాహుల్ ఆహ్వానించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ దిగ్గజాలంతా ఒక్కచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 2015లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే!

 

 

Related News