అందరి సంగతి తేలుద్దాం

యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ పట్ల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. సోమవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన ‘ భారత్ బచావో ‘ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..సోనియాను కెటీఆర్.. అమ్మ ..బొమ్మ అని వ్యంగ్యంగా ఎద్దేవా చేయడాన్ని సహించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు యువత నడుం కట్టాలని, రానున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇవ్వవలసిన అవసరం ఉందని ఆన్నారు. అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లు రాసి పెట్టుకోవాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరి సంగతి తేలుద్దామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అటు-కోమటిరెడ్డి సహా ఇతర కార్యకర్తలు ‘ చలో ప్రగతి భవన్ ‘ అంటూ రోడ్డుపైకి దూసుకురాగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో ట్రాఫిక్ చాలాసేపు స్తంభించి పోయింది.

Related News