డిగ్గీరాజా చెప్పిన ‘నగ్నసత్యం’!

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కి ఎట్టకేలకు జ్ఞానోదయం కలిగినట్లుంది. ముదురు వయసులో పెళ్లి చేసుకుని ‘నేనింతే’ అంటూ చెలరేగిపోయిన ఈ పెద్ద మనిషి.. ఆ తర్వాత కూడా అనేకమార్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి పార్టీకి తలనొప్పిగా మారారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో తనకు ఏ రోల్ ఇవ్వాలన్న సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి డిగ్గీరాజా బిగ్ రిలీఫ్ ఇచ్చేశాడు.

‘నేను ఏం మాట్లాడినా పార్టీకి చెడ్డపేరు వస్తోంది. నేను నోరు తెరిస్తే ఓట్లు పోతాయే తప్ప రావు.. ” అంటూ తన నోటితోనే చెప్పి సదరు వీడియోను బైటికొదిలాడు. మూడు రోజుల కిందట రికార్డ్ చేసినట్లున్న ఈ వీడియో.. ప్రస్తుతం పార్టీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో వైరల్ అయ్యింది. రాహుల్ నిర్వహించే ర్యాలీలు, బహిరంగసభలకు దూరంగా ఉంటున్న దిగ్విజయ్‌సింగ్.. ఇక తన పని ‘అయిపోయినట్లే’నన్న క్లారిటీ ఇచ్చేశారు. రెండు సార్లు మధ్యప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషికి ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చింది అంటూ సానుభూతి కురుస్తోంది డిగ్గీరాజా మీద!

Related News