బాబూ ! ఇదేం తీరు ? కేవీపీ ఫైర్

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో పోరాటం చేస్తోందని, నాడు హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్న మీరు నేడు ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. హోదా కోసం పోరాటం చేసినవారిపై కేసులు పెట్టారని, ఆ నాడు ప్యాకేజీకి ఒప్పుకుని సన్మానాలు కూడా చేయించుకున్నారని కేవీపీ దుయ్యబట్టారు. హోదా కోసం మా పార్టీ ఎప్పుడూ కట్టుబడే ఉంటుంది అని పేర్కొన్నారు.

Related News