కక్ష సాధిస్తున్నారు..గండ్ర

రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా నా మీద, నా తమ్ముడి మీద పోలీసు కేసు పెట్టించారు..మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నారు. క్రషర్ వ్యాపార లావాదేవీల్లో తేడాల కారణంగా  భాగస్వామి యర్రబెల్లి రవీందర్ రావు ఫిర్యాదు మేరకు గండ్ర పైన, ఆయన సోదరుడు భూపాల్ రెడ్డి పైన వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన తమ్ముడ్ని చంపుతానని రవీందర్ బెదిరించారని, అతనిపై తన తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారని గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. నా వద్ద గానీ, నా సోదరునివద్ద గానీ వెపన్స్ లేవు. వాటిని 2015 లోనే పోలీసులకు సరెండర్ చేశాం అని ఆయన తెలిపారు. తమపై కేసులు పెట్టడం ద్వారా.. తెలంగాణాలో కాంగ్రెస్ శ్రేణులను ఈ ప్రభుత్వం భయపెట్టజూస్తోందని అన్నారు.

Related News