కేసీఆర్ ఫోన్, బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే

టికెట్లు రాక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు మెల్లగా చెక్ పెడుతోంది టీఆర్ఎస్ అధిష్టానం. తాజాగా చెన్నూరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఎట్టకేలకు మెత్తబడ్డారు. సీఎం కేసీఆర్ నుంచి ఫోన్‌ రావడంతో స్వీయ గృహ నిర్బంధం నుంచి బయటకొచ్చారు. కేసీఆర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, బుధవారం హైదరాబాద్‌ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధినేత తనకు తప్పకుండా న్యాయం చేస్తారనే ధీమాని ఆయన వ్యక్తంచేశారు.

ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేరు లేదు. దీంతో ఆయన మందమర్రిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో కూర్చొని తాళాలు వేసుకున్నారు. టికెట్ కేటాయింపుపై హామీ ఇస్తేనే నిర్బంధం నుంచి బయటకు వస్తానని చెప్పడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఓదేలు ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్నారు. చివరికి కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో బయటకువచ్చారు.

Related News