4రోజులుగా కేసీఆర్‌ నాన్‌స్టాప్ ఫోన్లు.!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఫోన్లతో బిజీ అయిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ అన్ని జిల్లాల నేతలకు ఫోన్లు చేసిమరీ తట్టిలేపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం.. లేదా ముందస్తుగా వచ్చినా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండంటూ ఆదేశాలిస్తున్నారు. నవంబరు, డిసెంబరులోనే ఎన్నికలు రావచ్చు. లేదా జనవరి-ఫిబ్రవరిలోనూ జరగొచ్చు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచి తీరాలి. ఇందుకోసం శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకోండంటూ సూచిస్తున్నారు.

నాలుగైదు రోజులుగా 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి మూడు, ఆరు నెలలకోసారి పోలీసు నిఘా విభాగం ఇచ్చే సాధారణ నివేదికతోపాటు మూడు వేర్వేరు ఏజెన్సీలతో చేయించిన సర్వే ఫలితాల ఆధారంగా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related News