న్యూటెక్నాలజీపై సింగపూర్‌ నిపుణులతో చంద్రబాబు చర్చ

అత్యాధునిక టెక్నాలజీతో సింగపూర్‌ ఎలా కొత్త పుంతలు తొక్కుతోందన్న విషయంపై అధ్యయనం చేస్తున్న సీఎం చంద్రబాబు.. ఆ టెక్నాలజీని ఏపీలో కూడా ఎలా వినియోగించుకోవాలని భావిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడి నిపుణులతో చర్చిస్తున్నారు.

తమ రాష్ర్టంలోనూ ఆ తరహా స్కిల్డ్స్ టెక్నాలజీని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరైన ఆయన, పనిలోపనిగా అక్కడి వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

లీ క్వాన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఎల్‌కెవై స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ-ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. పాలనలో పోటీతత్వం పెంచేలా పరిశోధన, శిక్షణ తదితర అంశాల్లో పరస్పర సహకారానికి ఈ ఎంవోయూ దోహదపడనుంది. సింగపూర్ నైపుణ్యం, అత్యాధునిక నిర్మాణశైలిని తమకు అందించాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరారు.

Related News