బ్యాంకులపై బాబు ఫైర్, మిగతా ప్రాంతాల మాటేంటి?

నోట్ల రద్దు అయి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ నగదు కోసం ప్రజలు ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు సీఎం చంద్రబాబు, ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడం కష్టమవుతోందని, బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై వుందన్నారు. బ్యాంకులపై ప్రజలకున్న నమ్మకాన్ని కొనసాగించేలా చూడాలని, ఇందుకోసం బ్యాంకులు, తమ ప్రాంతాలు, గ్రామాల పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి.

Related News