బాబు, పవన్.. ఎడమొహం.. పెడమొహం!

చాలారోజుల గ్యాప్ తర్వాత సీఎం చంద్రబాబు- జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఒకే కార్యక్రమంలో మెరిశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సమీపంలో జరిగిన దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో పాటు సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి వీవీఐపీల రాక నేపథ్యంలో పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు కూడా పోటెత్తారు. హైందవ సాంప్రదాయాల ప్రకారం అతిథులకు సాదరంగా ఆహ్వానం అందింది.

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో ఇమిడిపోవడంతో కెమెరాలు తళుక్కుమనిపించాయి. ఇద్దరూ ఎదురుపడినప్పటికీ ఒకరికొకరు మొహం చాటేసి.. కనీస పలకరింపులకు సైతం ప్రయత్నం చేయలేదు. గతంలో పొత్తు సమయంలో సన్నిహితంగావున్న ఇద్దరునేతలు ఇటీవలికాలంలో విబేధించడంతో.. ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండాల్సి వచ్చింది.

READ ALSO

Related News