అన్ లిమిటెడ్ ఆఫర్‌,ఆపై హోటల్ క్లోజ్

కస్టమర్స్‌ని పెంచుకోవాలని భారీగా ప్లాన్ చేశాడు ఓ హోటల్ యజమాని. కేవలం రూ. 1300కు చెల్లించి ‘అన్ లిమిటెడ్ ఫుడ్’ పేరిట ఆఫర్‌ ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న భోజన ప్రియులు హోటల్ ముందు క్యూ కట్టేశారు. బిజినెస్ మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది. వచ్చినవాళ్లంతా తిన్నంత తిని మిగతాది పార్శిల్ తీసుకెళ్లడం మొదలుపెట్టారు. రెండువారాల తర్వాత బిజినెస్ కాస్తా నష్టాల వైపు మళ్లింది. ఇక చేసేదేమీ లేక రెస్టారెంట్‌ని మూసేశాడు.

ఈ వ్యవహారం చైనాలోని చెంగ్డూ సిటీలో వెలుగుచూసింది. ‘జియా మెర్నర్’ పేరిట ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించాడు సు జై అనే వ్యక్తి. నెలలో ఎప్పుడైనా రూ.1300 చెల్లించి ఉదయం 11 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కావాల్సిన ఫుడ్ ఆఫర్ చేసుకోవచ్చని ప్రకటించాడు. కస్టమర్స్ తాకిడి తట్టుకోలేకపోయింది ఆ హాటల్. చివరకు జూన్ 19న దుకాణం బందైంది. తమ బిజినెస్ నష్టాలబాట పట్టడానికి మేనేజ్‌మెంట్ కారణమని, అందువల్లే దుకాణం మూత వేయాల్సివచ్చిందని తెలిపాడు.

Related News