కూకట్‌పల్లి అభ్యర్థిని మార్చండి

హైదరాబాద్ కూకట్‌పల్లి అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. టీడీపీనుంచి తెరాసలోకి వచ్చిన ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ తేళ్ళ నర్సింగ్ రావు పటేల్ ఆధ్వర్యాన నిరసనకారులు ఆందోళనకు దిగారు. కృష్ణారావు పోస్టర్‌ను దగ్ధం చేశారు. తమ నియోజకవర్గ అభ్యర్థిని మార్చకపోతే కేసీఆర్ ఇంటివద్దే ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణా ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News