చంద్రబాబు దిగ్భ్రాంతి

అరకు ఎమ్మెల్యే కిడారు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు ఈ విషయం తెలియగానే జరిగిన విషయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను ఖండించిన ఆయన.. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అని, ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను గర్హించాలని అన్నారు. వెనుకబడిన ఏజన్సీ ప్రాంత అభివృద్ధికి కిడారి, సోమ చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related News