కేంద్ర నిర్ణయంపై టీడీపీ పోరుబాట

మోదీ సర్కారుపై ప్రత్యేక హోదా పోరు సాగిస్తున్న టీడీపీ సర్కారుకు మరో అస్త్రం దొరికింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ పోరాటానికి రెడీ అవుతోంది. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.

తిరుపతిలో పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన 2014లో తిరుపతి పార్లమెంట్ సీటు బీజేపీకి ఇచ్చి తప్పుచేశామన్నారు. ఐక్యంగా పనిచేస్తే తిరుపతి ఎంపీ సీటుతో పాటు 7అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు తథ్యమని చెప్పారు. ఉపఎన్నికలు వస్తే వైసీపీ చిత్తుగా ఓడిపోయేదని.. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ ఎంపీలు రాజీడ్రామాలడారని చెప్పుకొచ్చారు. బీజేపీతో కుమ్మక్కైన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు అన్నారు.

READ ALSO

Related News