‘ఎన్టీయార్’ బయోపిక్.. కీలక ఎపిసోడ్.. మిస్టరీ ‘1984’!

తెలుగుతేజం నందమూరి జీవిత చరిత్ర తెరరూపం ‘ ఎన్టీయార్’ మూవీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్. అటు సినిమా వర్గాలు, ఇటు రాజకీయ పార్టీల్లో ఆసక్తి రేపిన చంద్రబాబు పాత్ర మీద కొత్త క్లారిటీ ఇది! ఈ మూవీలో బాబు పాత్ర చేస్తున్న దగ్గుబాటి రానా గెటప్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 1984లో రాజకీయాల్లో చురుగ్గా వున్నప్పటి చంద్రబాబు నాయుడి గెటప్‌లో రానా బాగా ఒదిగిపోయాడు. ‘గడ్డం లేని బాబు’ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా కొంత పార్ట్ ఫినిష్ చేసుకున్న ‘ఎన్టీయార్’ బయోపిక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1982లో చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీడీపీ చేతిలో ఓడిపోయి.. ఆ వెంటనే తెలుగుదేశంలో చేరిన చంద్రబాబు.. 1984లో జరిగిన ఆగస్టు సంక్షోభం నుంచి, నాదెండ్ల కుట్ర నుంచి పార్టీని కాపాడి తన పొలిటికల్ స్టామినాను రుజువు చేసుకున్నారు.

సదరు ఎపిసోడ్ మొత్తాన్ని సినిమాలో చూపించనున్నట్లు ఈ ‘పిక్’ ద్వారా తెలుస్తోంది. ‘ఎన్టీయార్’ బయోపిక్ కేవలం ఎన్టీయార్ పొలిటికల్ అరంగేట్రం వరకే పరిమితం అవుతుందన్న ఊహాగానాలకు దీంతో తెరపడినట్లయింది.

 

READ ALSO

Related News