చంద్రబాబు, రాహుల్ విందు రాజకీయాలు

హస్తిన వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విందు రాజకీయాలకు తెరతీయబోతున్నారా? ఢిల్లీలో రేపు రాహుల్ ఇవ్వబోతోన్న ఇఫ్తార్ విందులోని కీలకాంశం అదేనా ? ఈ ఇఫ్తార్ విందుతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ వడివడిగా అడుగులు వేస్తాడని వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రాహుల్ విందు కొత్త కొత్త సందేహాలకు తావిచ్చేలా వుంది.

ఏపీ సీఎం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఇఫ్తార్ విందు ఆహ్వానం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆంగ్ల వార్తా సంస్థ IANS ఒక కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడ్డ టీడీపీ కి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు విందుకు ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఒకే వేదిక మీద చంద్రబాబు కనిపించారు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీతో కరచాలనం కూడా చేశారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ నేతలు ఒక్కసారిగా బాబుపై విమర్శలు కురిపించారు. మరిప్పుడు విందుకు వెళితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బంధం మరింత బలపడినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో రాహుల్ నేతృత్వంలో ఇఫ్తార్ విందు జరగనున్న సంగతి తెలిసిందే.

Related News