ఆమె.. పరువు నిలబెట్టింది..!

హిమా దాస్.. 18 ఏళ్ల అస్సామీ చిన్నది.. ఇప్పుడు జాతి రత్నంలా మెరిసిపోతోంది. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి ఇండియన్ స్ప్రింటర్‌గా చరిత్రకెక్కిందీమె. 400 మీటర్ల పరుగును 51.46 సెకన్లలో ముగించి గోల్డ్ మెడల్ దక్కించుకుంది.

ఫిన్లాండ్లో జరుగుతున్న ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్20 ఛాంపియన్ షిప్ లో 18 ఏళ్ల హిమా దాస్ కదం తొక్కిన తీరు.. దేశం మొత్తానికీ గర్వదాయకమంటూ ప్రశంసలు హోరెత్తుతున్నాయి. ఈవెంట్ అనంతరం.. గ్లోబల్ మీడియాతో ఇంగ్లీష్‌లో మాట్లాడ్డానికి ఆమె తడబడ్డ తీరు కూడా మీడియాలో వార్తగా మారింది. ఇంగ్లీష్ రాకపోతేనేం.. నువ్వు మా ముద్దుబిడ్డవు అంటూ హత్తుకుంటోంది జాతి మొత్తం.

కాన్ బెర్రాలో పీటీ ఉష సాధించిన 51.61 సెకన్ల రికార్డును బద్దలు కొట్టడంతో పాటు మరిన్ని మైలురాళ్లను దాటేసింది. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన హిమా దాస్, నిర్దిష్ట శిక్షణ లేకుండానే కేవలం 18 నెలల కఠోర శ్రమతో ఈ ఘనత సాధించింది. అందుకే.. తారక్ నుంచి రాజమౌళి దాకా, సచిన్ నుంచి మోదీ దాకా.. ప్రతిఒక్కరూ ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇండియన్ అథ్లెట్స్‌కి హిమా ఆదర్శదాయకమంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 

READ ALSO

Related News