ఏపీ: అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా- బైరెడ్డి

ఏపీకి ప్రత్యేక‌హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమంటున్నారు కర్నూల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. 13 జిల్లాలకు మాత్రమే పరిమితమైన పార్టీలు రాష్ర్టానికి ఏమీ చేయలేవని, కాంగ్రెస్‌తోనే హోదా సాధ్యమని చెబుతున్నారు. అంతేకాదు కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీయేనని కుండబద్దలు కొట్టేశారు. ఏపీ విభజనకు ముందు ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి, ఏపీలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు.

శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి రాయలసీమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన విషయం తెల్సిందే! మరోవైపు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తర్వాత సీమ నుంచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సెకండ్ పొలిటికల్ నేత బైరెడ్డి.

READ ALSO

Related News