ఉప ఎన్నికలు, బీజేపీకి మళ్లీ అగ్ని పరీక్ష

ఉప ఎన్నికల ద్వారా బీజేపీకి మళ్లీ అగ్నిపరీక్ష. 10 రాష్ర్టాల్లో నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లకు సోమవారం (మే 28) పోలింగ్ జరగనుంది. మహారాష్ర్ట (పాల్గార్‌, భండారా-గోండియా), ఉత్తరప్రదేశ్ (కైరానా), నాగాలాండ్‌ల్లో లోక్‌సభ సీట్లకు… అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, మేఘాలయ, ఉత్తరాఖండ్, కేరళ, బీహార్, జార్ఖండ్, పంజాబ్, మహారాష్ర్ట, కర్ణాటకల్లో పది సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం ఈనెల 31న వెల్లడికానున్నాయి.

మహారాష్ట్రలోని రెండు సిట్టింగ్‌ సీట్లు ఒకప్పుడు బీజేపీదే! భండారా-గోండియా ఎంపీ పాటొలే బీజేపీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పాల్గార్‌లో ఎంపీ చనిపోతే ఆయన కుటుంబసభ్యులు శివసేనలో చేరారు. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికకు ముందు ఇవే చివరి ఉపఎన్నికలు చెబుతున్నాయి రాజకీయ పార్టీలు. మోదీ సర్కార్ నాలుగేళ్ల అయిన సందర్భంగా రకరకాలుగా సర్వేలు వెలువడ్డాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని తేల్చాయి. మరి బైపోల్‌లో బీజేపీ పుంజుకుంటుందా? లేదా అన్నది చూడాలి.

Related News