ఢిల్లీ బురారీ కేసులో కొత్త ట్విస్ట్, ఈసారి

ఢిల్లీలోని బురారీ ఆత్మహత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. మొత్తం ఫ్యామిలీ సభ్యుల మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికను డాక్టర్లు పోలీసులకు అందజేశారు. ఐతే, ఈ నివేదిక కొత్త సందేహాన్ని లేవనెత్తింది. ఆ ఫ్యామిలీ మొత్తం 11 మంది చనిపోగా, వాళ్లలో 10 మంది ఉరేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదిక అసలు సారాంశం. వాళ్ల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, వాళ్లే ‌సూసైడ్ కి పాల్పడినట్లు నివేదిక చెబుతోంది.

ఇంటి పెద్దామె నారాయణ దేవి ఎలా చనిపోయిందనే విషయం రివీల్ కాలేదు. దీంతో నారాయణ దేవి మరణం గురించి బుధవారం డాక్టర్ల టీమ్ మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. త్వరలోనే ఆమెకి సంబంధించిన నివేదికను ఇవ్వనుంది. జులై ఒకటిన బురారీలో 11 మంది కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూఢనమ్మకాల నేపథ్యంలో వీళ్లంతా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు పోలీసులు.

READ ALSO

Related News