అన్నద‌మ్ముల పంచాయితీ

త‌న‌కు టిక్కెట్ ఇప్పించ‌లేక‌పోయిన త‌మ్ముడు మీదే అలిగిన అన్న త్వరలోనే టి.ఆర్‌.ఎస్.కు గుడ్‌బై చెప్పనున్నట్టు స‌మాచారం. త‌న‌కు ఎట్టి ప‌రిస్ధితుల్లో చెన్నూరు టిక్కెట్టు ఇవ్వాల‌ని ప‌ట్టుప‌డుతున్న మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధప‌డిన‌ట్టు తెలుస్తోంది. వినోద్ టిక్కెట్టుకోసం ప‌ట్టుబ‌డుతున్న సోద‌రుడు వివేక్, ప్రస్తుతం టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్ధిగా ప్రక‌టించిన సుమ‌న్‌కి అనుకూలంగా ఇంత‌వ‌ర‌కూ ఒక్కసారి కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన‌లేదు.

వినోద్‌, వివేక్ ఇద్దరూ క‌లిసి మొద‌టి నుంచి త‌న కుటుంబానికి స‌పోర్ట్‌గా ఉన్న చెన్నూరు టిక్కెట్టు త‌మ‌కే కేటాయించాల‌ని కె.టి.ఆర్‌.ను కోరారు. అయితే ఈ విష‌యంలో తాను ఏమీ చేయ‌లేన‌ని, ముఖ్యమంత్రే తుది నిర్ణయం తీసుకోవాల‌ని కె.టి.ఆర్‌. చెప్పడంతో వినోద్‌లో అస‌హ‌నం రోజురోజుకి పెరిగిపోతోంది. నాలుగు రోజుల నుంచి ఎదురుచూస్తున్నా కె.సి.ఆర్‌. నుంచి ఎలాంటి పిలుపు రాక‌పోవ‌డంతో అవ‌స‌ర‌మైతే వివేక్‌ను వదిలిపెట్టి తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరుతానని వినోద్ కార్యకర్తల‌తో అంటున్నట్టు తెలుస్తోంది.

Related News