క్రికెటర్‌తో డేటింగ్‌పై రిప్లై

చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ వార్తల్లోకి వచ్చింది. ఈమెకి కత్రినా తరహాలో ఫీచర్స్ వుండడంతో జూనియర్ కత్రినా అని పిలుస్తుంటారు. కానీ, కత్రినా మాదిరిగా ఇమేజ్ దక్కించుకోవడానికి నానాకష్టాలు పడుతోంది. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. పాకిస్థాన్ యువ క్రికెటర్ ఫకార్ జమాన్‌తో ఈమె డేటింగ్‌‌లో వున్నట్టు ఓ రేంజ్‌లో వార్తలు హంగామా చేస్తున్నాయి. చివరకు నేషనల్ మీడియా ఈమెపై ఓ స్టోరీని రాసుకొచ్చింది. దానికి ఈ విధంగా రిప్లై ఇచ్చేసింది ఈ అమ్మడు. అది చెత్త వార్త అంటూ చెప్పుకొచ్చింది జరీన్‌ఖాన్.

ఎవరీ పాక్ క్రికెటర్?

 

ఏడాది కిందట పాకిస్థాన్ టీమ్‌లోకి అడుగుపెట్టాడు ఫకార్ జమాన్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఇప్పటివరకు 23 వన్డేలు ఆడిన ఆ ప్లేయర్, మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు సాధించాడు. పాక్ తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

బాలీవుడ్‌ హీరోయిన్లతో క్రికెటర్లు

 

బాలీవుడ్ హీరోయిన్లతో క్రికెటర్లు డేటింగ్ చేయడం ఇదేమీ కొత్తకాదు. అనుష్క శర్మని విరాట్, హేజిల్‌ కీచ్- యువరాజ్ సింగ్, సాగరిక- జహీర్‌ఖాన్ జోడీలు మ్యారేజ్ చేసుకున్న విషయం తెల్సిందే!

Related News