గాళ్‌ఫ్రెండ్‌ని వేధించి బుక్కైన నటుడు

గాళ్‌ఫ్రెండ్‌ని శారీరంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లి. ఈ వ్యవహారం వెనుక ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. మూడేళ్ల నుంచి అర్మాన్ త‌న గాళ్‌‌ఫ్రెండ్‌ నీరూతో వుంటున్నాడు. ఐతే, కొద్దిరోజుల కిందట ఆర్ధిక లావాదేవీల విష‌యంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

జూన్ 3న అర్మాన్ త‌న ప్రేయ‌సి నీరూతో గొడ‌ప‌డ్డాడు. పట్టరాని కోపంతో నీరూని బ‌లంగా నెట్టేయ‌డంతో మెట్లపై నుండి కిందపడడంతో ఆమెకి తీవ్రగాయాల‌య్యాయి. అంతేకాదు ఆమె జుట్టు పట్టుకొని నేల‌కేసి బాదాడు. గాయ‌ప‌డిన బాధితురాలు పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్ళి కోహ్లిపై ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పరారీలోవున్న కోహ్లిని గతరాత్రి అరెస్ట్ చేశారు. ఇటీవల సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ టీవీ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యాడు అర్మాన్ కోహ్లి.

Related News