అక్రమంగా బాలికలకు అబార్షన్లు

హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలోని శ్రీవల్లి ఆస్పత్రిలో అక్రమాలు బట్టబయలయ్యాయి. అనుమతులు లేకుండా అబార్షన్లు చేస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది. 19ఏళ్ల బాలికకు అబార్షన్‌ చేస్తూ పట్టుబడ్డారు శ్రీవల్లి ఆస్పత్రి వైద్యులు. అర్హతలేని వైద్యులతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు, అబార్షన్లు చేస్తున్నట్టు తెలియడంతో ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా వైద్యశాఖ అధికారి విచారణ చేపట్టారు. శ్రీవల్లి ఆస్పత్రికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతుండగా, ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేస్తున్నామంటున్నారు శ్రీవల్లి ఆస్పత్రి వైద్యులు. ఎట్టకేలకు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Related News