వైరల్ వీడియో.. అగరుబత్తులతో బూడిదైన బీఎండబ్ల్యూ కారు

ఓ వ్యక్తి ఎంతో ముచ్చటగా కొనుగోలు చేసిన కొద్దిగంటల్లోనే బీఎండబ్ల్యూ తగలబడింది. ఈ ఘటన చైనాలోని యాంగ్జూ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దాదాపు రూ.50 లక్షలు పెట్టి బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. కొత్త వాహనం కావడంతో పూజ చేశాడు. ఈ సందర్భంగా అగరబత్తీలు వెలిగించి బయటకువెళ్లాడు ఓనర్. కొద్దిసేపటికే అగరుబత్తిలోని నిప్పురవ్వలు కారు మీద పడ్డాయి. ఇంకేముంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News