అలా చేస్తే.. దారికి తెచ్చుకోవచ్చు- ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. సింగపూర్‌లో జరుగుతున్న ట్రంప్-కిమ్ భేటీని నిశితంగా పరిశీలిస్తున్నారు ఆయన. పాకిస్థాన్‌ని తమ దారిలోకి తెచ్చుకోవాలంటే ట్రంప్ వ్యూహాన్ని అవలంభిస్తే బాగుంటుందని మోదీ సర్కార్‌కి ఓ సలహా ఇచ్చేశారు. శత్రువుని లొంగదీసుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తులు చర్చల వరకు వెళ్లాయని గుర్తుచేశారు. తొలుత పాకిస్థాన్‌ని భయపెట్టాలని, ఇండియా తలచుకుంటే ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేయగలుగుతుందన్న ఆందోళనను క్రియేట్ చేయాలంటూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మరోవైపు ఈ విషయంలో చైనాను తటస్థంగా ఉంచాలని, ఆపై పాకిస్థాన్ పెంపుడు పిల్లిలా ఇండియా ముందు తోకాడిస్తూ కూర్చుంటుందన్నారు. స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Related News