అమిత్ షాకి ప్రమోషన్!

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తోంది బీజేపీ. ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ప్లాన్ చేస్తోంది. రెండుసార్లు సారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం వచ్చేఏడాది జనవరితో ముగియనుంది. ఎన్నికల వేళ షా నేతృత్వం లేకుంటే గెలవడం కష్టమని భావించింది మోదీ టీమ్. ఇందులో భాగంగా శనివారం జరిగిన బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశంలో షా పదవీ కాలాన్ని పెంచాలని నిర్ణయం జరిగింది.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పడు పార్టీ సారధిగావున్న రాజ్‌నాథ్‌సింగ్‌ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పార్టీ పగ్గాలను అందుకున్నారు అమిత్‌ షా. 2016లో జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో షా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెల్సిందే! బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తి మూడేళ్లపాటు కొనసాగుతారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత షాకి ప్రమోషన్ ఇచ్చి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తోంది.

READ ALSO

Related News