రామోజీతో అమిత్ షా.. బేరమేంటి బాసూ!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అలర్టయ్యింది. ఎప్పుడూలేని విధంగా ఈసారి నార్త్ కంటే సౌత్ వైపే ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ వారంలో నాలుగైదు రోజులు ఆ పార్టీ టాప్ లీడర్స్ అంతా తెలుగు రాష్ర్టాల్లోనే మకాం వేశారు. పోలవరం పేరిట నదుల మంత్రి గడ్కరీ, మంగళగిరి ఎయిమ్స్ పనుల గురించి హెల్త్ మినిస్టర్ నడ్డా ఏపీకి వచ్చారు. తాజాగా ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. పనిలోపనిగా మీడియా మొఘల్ రామోజీరావును షా కలిశారు.

రామోజీ- అమిత్ భేటీ వెనుక మర్మమేంటన్న టాక్ షురూ అయ్యింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచార కార్యక్రమంలోభాగంగానే రామోజీరావును అమిత్ షా కలిసినట్టు కొందరు చెబుతున్నప్పటికీ, అంతకంటే బలమైన కారణం వుండొచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో మీడియా సహకారం లేక అల్లాడిపోతున్న బీజేపీని ఈ విధంగా సేదతీర్చాలని షా భావించి వుండవచ్చు.

Related News