అఖిల వివాహ ఆహ్వానం ఇదిగో..

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వివాహ వేడుక ఏర్పాట్లు భారీఎత్తున జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీ ఉదయం 10.57 గంటలకు ఆమె పారిశ్రామికవేత్త భార్గవరామ్‌తో పెళ్లిపీటలెక్కనుంది. పెళ్లికొడుకు భార్గవ్ ఎవరోకాదు ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మాజీ అల్లుడు. మంత్రి నారాయణ పెద్దల్లుడు పునీత్ పిన్ని కొడుకే వరుడు భార్గవ్. ఇప్పటికే భూమా ఫ్యామిలీ శుభలేఖల పంపిణీలో బిజీగా ఉంది. శుభలేఖపై అఖిల తల్లిదండ్రులు శోభ, నాగిరెడ్డిల ఫొటోలను ముద్రించారు. కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డలో ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో వివాహం జరగనుంది. సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాల నుంచి పెద్దఎత్తున ప్రముఖులు హాజరు కానుండటంతో ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు. ఇదే అఖిల శుభలేఖ.

Related News