అనుష్కకి అంత సీన్లేదు బాసూ.. ప్రభాస్ పిచ్చ క్లారిటీ!

‘ప్రభాస్ వెడ్స్ అనుష్క’.. ఈ రేంజిలోకెళ్ళిపోయింది టాలీవుడ్ సోషల్ మీడియా. బాహుబలి సూపర్ కపుల్.. రియాలిటీలో కూడా హాట్ కపుల్ కాబోతోందని.. త్వరలో ముహూర్తం కూడా ఖరారవుతుందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుకార్లు గుప్పుమంటున్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా మరో వెర్షన్ కూడా బైటికొచ్చింది. ఇరు కుటుంబాలూ ‘పెళ్లి పనుల్లో’ బిజీగా వున్న మాటయితే వాస్తవమని.. కానీ.. వధూవరులు మాత్రం వీళ్ళిద్దరూ కాదని ప్రభాస్ సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ప్రభాస్ తల్లితో కలిసి పెదనాన్న కృష్ణంరాజు ఇటీవలే భీమవరంలో ఒక సంబంధం చూశారట! ఈ మ్యాచ్‌ని ప్రభాస్ కూడా ఓకె చేసినప్పటికీ.. ‘సాహో’ మూవీ ఫైనల్ షెడ్యూల్ ముగిసేదాకా ఆగాలన్న షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

పైగా.. మనూరమ్మాయైతే బెటరంటూ ప్రభాస్ కూడా పదేపదే చెప్పేవాడన్నది భీమవరం ‘ప్రభాస్ ఫ్రెండ్స్’ చెబుతున్న మాట. ప్రభాస్ ఫిక్స్ చేసిన అమ్మాయి గోదావరి జిల్లాలో ఒక విద్యాసంస్థ అధినేత కూతురిగా చెబుతున్నారు. వివరాలు గోప్యంగా ఉంచాలన్న కృష్ణంరాజు రిక్వెస్ట్ మేరకు లోకల్ మీడియా అదుపులో ఉందట. అయితే.. ‘భీమవరం మ్యాచ్’ ఇంతకుముందు కూడా ఒకసారి వార్తల్లోకెక్కింది. అదీ ఇదీ ఒకటేనా లేక.. వేరువేరా..? అనేది సస్పెన్స్!

Related News