అమితాబ్ యాడ్‌పై బ్యాంకులు సీరియస్

అమితాబ్ బచ్చన్- ఆయన కుమార్తె శ్వేత నందాబచ్చన్ నటించిన యాడ్‌పై బ్యాంకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ప్రకటన బ్యాంకులపై ప్రజలకున్న నమకాన్ని పోగొట్టేలా వుందని, మీ బిజినెస్ కోసం బ్యాంకులను అవమానించేలా ఎలా చిత్రీకరిస్తారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపైనే సామాన్యులకు అపనమ్మకాన్ని కలిగించేలాఉందని విరుచుకుపడుతున్నారు. ఈ ఆరోపణలను కల్యాణ్ జువెల్లర్స్ తోసిపుచ్చింది. అది ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని, కేవలం ఫిక్షన్ మాత్రమేనని అంటోంది. ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందంటే..

వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ఓ యాడ్ రూపొందించింది కల్యాణ్ జ్యూవెలర్స్. హిందీలో అమితాబ్ నటించారు. తన ఖాతాలో ఒక నెల పెన్షన్‌కు బదులు రెండు నెలల పింఛన్ వచ్చిందని, అదనంగా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు పింఛన్‌దారుడు (అమితాబ్) తన కూతురితో బ్యాంక్‌కు వస్తాడు. కౌంటర్లలోని ఉద్యోగులు తొలుత అమితాబ్‌ను అవమాని స్తారు. చివరికి ఓ ఉద్యోగి దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతారు. దీంతో ఏం పర్లేదు ఉంచుకోమని చెబుతాడు. ఈ విషయం ఎవరికి తెలుసు, ఎవరు చూస్తారని చెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇందుకు అమితాబ్ ససేమిరా ఒప్పుకోడు. తనకు నమ్మకమే ముఖ్యమని అమితాబ్ చెప్పిన వెంటనే కల్యాణ్ జ్యూవెల్లర్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

READ ALSO

Related News