ఆ కసాయి తండ్రి అరెస్ట్

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో తాగిన మత్తులో తన మూడేళ్ళ కొడుకును ఆటోకేసి కొట్టిన ఆటో డ్రైవర్ శివగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అనూష అనే యువతిని ఇతగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలని తెలిసింది. అయితే స్థానికంగా ఉండే మరో యువతిని కూడా గౌడ్ పెళ్లి చేసుకున్నాడని, అప్పటినుంచీ అనూషకు, ఇతనికి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని తెలిసింది.

తాగుడుకు బానిసైన గౌడ్ ఇటీవల మూడు రోజులక్రితం అనూషతో ఘర్షణకు దిగి..తాగిన మైకంలో తన మూడేళ్ళ కొడుకు రిత్విక్ ను ఆటోకేసి కొట్టడంతో ఆ చిన్నారి గాయపడ్డాడు. ఈ వైనమంతా సీసీటీవీ కెమెరాలకెక్కింది. ఇంత జరిగినా తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు అనూష విముఖత చూపడంతో పోలీసులే స్వయంగా తమంతట తాము గౌడ్ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న గౌడ్ చివరికి అరెస్టయ్యాడు.

Related News