బలి తీసుకున్న ‘అరవింద సమేత’ వివాదం

‘అరవింద సమేత’లో వివాదాస్పద మాటలను తొలగించాలంటూ ఆందోళనలు చేసిన రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకుల కారు రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఓ ఛానెల్‌లో డిబేట్ కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కి వస్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద కారు బోల్తాపడింది.

ఈ ఘటనలో జలం శ్రీను మరణించగా, సీమ కృష్ణ, రవికుమార్, రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడినవాళ్లలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమ యాస, భాషను కించపరిచే సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించాయి విద్యార్థి సంఘాలు.

Related News